ప్రజలను కాపాడలేని ఈటలకు ఆ పదవి ఎందుకు?

by Shyam |
ప్రజలను కాపాడలేని ఈటలకు ఆ పదవి ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో కరోనా విజృంభిస్తున్నా స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా వస్తే ఎలాగోలా చికిత్స చేయించుకుంటారని, కానీ ప్రజలకు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. అధికారులు, మంత్రులు కేసీఆర్‌కు ఊడిగం చేసింది చాలని, ఇకనైనా సీఎంకు భజనలు చేయడం మానేసి మానవత్వంతో పని చేయాలన్నారు. ఆరోగ్య మంత్రిగా ఈటెల రాజేందర్‌ ప్రజలను కాపాడుకోలేనప్పుడు మంత్రి పదవి ఎందుకని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కేసీఆర్ ఒక లక్ష వెంటిలేటర్లు, 2 లక్షల ఆక్సిజన్‌లను కరోనా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. గాంధీ ఆస్పత్రికి రూ. 3 వేల కోట్లు, జిల్లా ఆసుపత్రులకు రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని నిరసన తెలుపుతానని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed