‘చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలి’

by Shyam |
‘చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలి’
X

దిశ, శేరిలింగంపల్లి : ఉప ఎన్నికలు జరిగే ప్రతీచోట కేసీఆర్ ప్రభుత్వం కోట్లు గుమ్మరిస్తూ గెలుచేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఆదివారం వివేకానంద నగర్ డివిజన్ ఉషాముళ్ళపూడి కమాన్ వద్ద ఆందోళనకు దిగారు.

మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి విజిత్ వర్మ ఆధ్వర్యంలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విజిత్ వర్మ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుందని, అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే గాంధీ వెంటనే రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని, ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకోవాలని డిమాండ్ చేశారు.

నేషనల్ బీజేవైఎం ఆఫీస్ కో ఆర్డినేటర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, మంత్రులు రాజీనామా చేసిన నియోజకవర్గాలు తప్పా ఈ సీఎం కేసీఆర్ కు మిగతా చోట్ల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. పోలీసులు ఎమ్మెల్యే గాంధీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తమ హక్కులను అరిస్తున్నారని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను అక్రమ అరెస్ట్ చేయడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed