- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
దిగజారి మాట్లాడటం షబ్బీర్ అలీకి తగదు.. గంప గోవర్ధన్ ఆగ్రహం
దిశ, కామారెడ్డి: వరిధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం చేస్తుంటే, డ్రామాలు అనడం షబ్బీర్ అలీ దిగజారుడు తనానికి నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ సర్పంచ్ భర్త రాజేందర్ మృతిచెందడంతో శుక్రవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. అనంతరం షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం పార్లమెంట్‌లో ఆందోళన చేస్తోన్న ఎంపీలను విమర్శించడం మాజీ మంత్రి షబ్బీర్ అలీకి తగదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలను దద్దమ్మలు అనడం ఆయన స్థాయిని దిగజార్చుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు.