- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : జర్మనీ పౌరసత్వంపై చెన్నమనేని కౌంటర్..
దిశ, వెబ్‌డెస్క్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నననేని రమేష్ పౌరసత్వానికి సంబంధించి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చెన్నమనేనిని ప్రశ్నించగా తన జర్మనీ పౌరసత్వా్న్ని వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన న్యాయస్థానానికి వివరిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరిగా.. రెండు వారాల పాటు గడువును మంజూరు చేసింది హైకోర్టు. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని న్యాయమూర్తి ఇరువురికి సూచించారు. అనంతరం రెండు వారాల పాటు ఈ కేసు విచారణ వాయిదా పడింది.
కాగా, ద్వంద పౌరసత్వం కలిగిన రమేష్ ఎన్నిక చెల్లదంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతుండగా.. ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంశాఖ రెండు పౌరసత్వాలు కలిగి ఉన్నాడనే నెపంతో భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.