ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: ఎమ్మెల్యే చల్లా

by Shyam |   ( Updated:2021-09-15 02:10:53.0  )
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: ఎమ్మెల్యే చల్లా
X

దిశ, పరకాల: పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కొరకు పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, పార్టీ పదవులు ఆశించి భంగపడ్డ కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు గురి కావద్దని తప్పనిసరి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా అత్యధికంగా ఏకగ్రీవ కమిటీలను నియమించిన పరిశీలక బృందాన్ని ప్రశంసించారు. ఈ స్ఫూర్తితో మండల కమిటీలను సైతం జరిగేలా చూడాలని తెలియజేశారు. గ్రామ కమిటీ, మండల కమిటీ నాయకులు విపక్షాల విమర్శలు తిప్పి కొడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story