అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులా? : బచ్చుల

by srinivas |
అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులా? : బచ్చుల
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా.. అని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇళ్ళ స్థలాల పేరుతో ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరుతో వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. ఇకమీదట అక్రమ అరెస్టులు చేస్తే సహించేది లేదని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తామని టీడీపీ నేత బచ్చుల స్పష్టంచేశారు.

Advertisement

Next Story