- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ నిజ స్వరూపం అప్పుడే బయట పడింది ఈటల : ఆరూరి రమేష్
దిశ, జమ్మికుంట : దళిత బంధు సభ పథకానికి ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి బెంబేలెత్తి పోయి దళితుల్లో లేనిపోని అపోహలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ సృష్టిస్తున్నారని జమ్మికుంట మండల ఇంచార్జ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
గురువారం పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల్లో చైతన్యం వస్తే పుట్టగతులు ఉండవని, భావిస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దళిత వ్యతిరేక బావజాలంతో ఉన్న బీజేపీలో చేరడంతోనే ఈటల రాజేందర్ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని, దళిత బంధు.. నా(ఈటల) రాజీనామా వల్లనే వస్తుందని ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోరే ప్రభుత్వం ఎన్ని సమస్యలున్నా దళిత బంధు అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.