- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ ఆస్పత్రికి మిట్టా ఫౌండేషన్ చేయూత
దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆసుపత్రికి ఉస్మానియా వైద్యకళాశాల 1996 పూర్వవిద్యార్థుల సంఘంతో కలిసి కొవిడ్-19 బాధితుల కష్టాలు తీర్చేందుకు మిట్టా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. రోగులతో పాటు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అవసరాలు తెలుసుకోడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. స్నేహితులు, సహోద్యోగుల నుంచి అందిన విరాళాల సాయంతో తాము చేయగల కొద్దిపాటి సాయం చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల కోసం 10 రీయూజబుల్ డ్యూపాంట్ పీపీఈ కిట్లు, 20డిజిటల్ ఆక్సీమీటర్లు, 2ఆటోమేటిక్ శానిటైజర్లు తొలి విడతగా అందించారు. వీటన్నింటి విలువ రూ.లక్ష. రెండో విడతలో ఉస్మానియా ఆసుపత్రి, ఇతర ప్రభుత్వాసుపత్రులలో వైద్యులకు ఇలాంటి పరికరాలే అందుతాయన్నారు. రూ.5 లక్షల విలువైన సామగ్రి అందించాలని నిర్ణయించారు. వీటిలో పీపీఈ కిట్లు, డిజిటల్ ఆక్సీమీటర్లు, ఆటోమేటిక్ శానిటైజర్లు ఉన్నాయి.