- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటాసన్స్ కొనుగోలు చేయడం సవాలే
దిశ, వెబ్‌డెస్క్: టాటా (TATA) గ్రూప్‌తో ఉన్న 70 ఏల్ల అనుబంధాన్ని ముగింపు పలికేందుకు టాటాసన్స్ (Tatasons)తో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఉన్న షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ (SP Group) సిద్ధమైన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటాసన్స్‌లో షాపూర్‌జీ గ్రూపునకు 18.37 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, 2016లో పల్లోంజీ తనయుడు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా తొలగించిన తర్వాత నుంచి టాటా సన్స్, సైరస్ మిస్త్రీ కుటుంబాల మధ్య వివాదం పెరిగింది.
టాటా గ్రూప్‌తో జరుగుతున్న వివాదం కారణంగా ఆర్థికంగానూ, జీవనోపాధికి నష్టం కలుగుతుందనే సందేహాలతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించిన అనంతరం ఎస్‌పీ గ్రూప్ వాటాను కొనుగోలు చేసేందుకు టాటాసన్స్ సైతం అంగీకారాన్ని తెలిపింది. అదేసమయంలో అమ్మడానికి మిస్త్రీ కుటుంబం కూడా సిద్ధమైంది. బాండ్స్ చెల్లింపులకు కావాల్సిన నిధులను సమీకరించాలని, మిస్త్రీ గ్రూపునకు చెందిన 18 శాతం వాటాను కొనుగోలు చేస్తామని టాటాసన్స్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
అలా కాకుండా ఎస్‌పీ గ్రూప్ షేర్లను తనఖా పెట్టి నిధులను సమీకరించాలని చూస్తే, ఆ షేర్లు ఇతరుల చేతుల్లో వెళ్లే అవకాశాలున్నాయని టాటా గ్రూప్ సందేహపడుతోంది. ఈ కారణంతో ఎస్‌పీ గ్రూప్, సైరస్ మిస్త్రీ, అతనికి చెందిన పెట్టుబడి సంస్థలు టాటాసన్స్ షేర్లను తనఖా పెట్టడం లేదంటే బదిలీ చేయకుండా అక్టోబర్ 28 వరకు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇరు సంస్థలకు సూచించింది.
అయితే, ఎస్‌పీ గ్రూపునకు చెందిన వాటాలను కొనుగోలు చేయడానికి టాటాసన్స్‌కు సవాలుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌పీ గ్రూప్ వాటాను కొనేందుకు టాటాసన్స్ ముందుగా టీసీఎస్‌లో తమకున్న 72 శాతం వాటాలో 16 శాతం విక్రయించి 56 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. ఒకవేళ అలా జరగకుంటే వ్యూహాత్మక భాగస్వాములో లేదా బయటినుంచి వచ్చే ప్రైవేట్ ఈక్విటీ, సావరీన్ వెల్త్ ఫండ్ వంటి పెట్టుబడిదారులో టాటాసన్స్‌లో రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కావున, ఈ కొనుగోలు టాటాసన్స్‌కు సవాళ్లను తీసుకొస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, టాటాసన్స్, ఎస్‌పీ గ్రూప్ సంస్థల మధ్య అనుబంధం దశాబ్దాలుగా ఉంది. 1965లో మిస్త్రీ కుటుంబం ఈక్విటీ ఓనర్‌షిప్‌ను దక్కించుకోగా, 2012లో సైరస్ మిస్త్రీ ఛైర్మన్ అయ్యారు. తర్వాత సుమారు నాలుగేళ్లకు 2016లో ఆయనను తొలగించారు. అప్పటినుంచి ఇరువురి మధ్య వివాదం ముదిరింది.