- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్.. మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ ఫైనల్ వాయిదా.. తెలుగు అమ్మాయికి నిరాశ

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా మిస్ వరల్డ్ ఫైనల్ వాయిదా పడింది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021కు గాను మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ డిసెంబర్ 17(శుక్రవారం)న జరగాల్సి ఉంది . కానీ, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పోటీలను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు.
ఈ పోటీల్లో కంటెస్టెంట్లతో పాటు సిబ్బంది(17 మంది)కి కరోనా సోకడంతో ఫైనల్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కరోనా బారినపడిన వారిలో మిస్ ఇండియా, హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి కూడా ఉండటం గమనార్హం. ఈ పోటీల్లో భారత్ తరఫున మానన వారణాసి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిస్ ఇండియా 2020 కిరీటాన్ని కైవసం చేసుకున్న మానస.. మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అయింది. కరోనా కారణంగా పోటీ వాయిదా పడటంతో ఆమెకు నిరాశే ఎదురైంది.
Next Story