- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జై భీమ్‌తో జతకట్టనున్న మిస్ ఇండియా బ్యూటీ..?
దిశ, వెబ్‌డెస్క్: జై భీమ్ ఇటీవల సంచలనాలు సృష్టించిన సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమాతో సూర్య క్రేజ్ మరింత పెరిగింది. అయితే సూర్య అదే స్పీడుతో మరో సినిమా ఓకే చేశాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శకుడు బాలాతో సినిమా ప్లాన్ చేశాడు. అయితే అభిమానులకు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఓకే చేయనున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఈ సినిమా కోసం సూర్య ‘మిస్ ఇండియా’ బ్యూటీని తీసుకురానున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసమని మేకర్స్ మిస్ ఇండియా బ్యూటీ కీర్తి సురేష్‌ను సంప్రదించారట. అమ్మడు కూడా సినిమాపై ఆసక్తి చూపిందని, కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. కానీ దీనిపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటిస్తారేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమ్మడికి ఇది సూర్యతో రెండో సినిమా అవుతుంది. దర్శకుడు బాలాతో తొలి సినిమా కానుంది. సూర్య, కీర్తి 2018లో ‘గ్యాంగ్’ సినిమాతో తొలిసారి జతకట్టిన విషయం తెలిసందే. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మాతగా బాలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఇంకా మేకర్స్ నామకరణం చేయలేదు. సినిమా టైటిల్ తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.