- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె శీలం ఖరీదు రూ.50 వేలు.. అతగాడికి ఐదు చెప్పుదెబ్బలు
దిశ, వెబ్‌డెస్క్: మనిషి ప్రాణానికి ఖరీదెంత..? ఒక అమ్మాయి శీలానికి విలువెంత..? అన్యాయానికి ఎంత డబ్బు ఇస్తే న్యాయం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలన్నీ ఓ బాలిక మనసును కదిలిస్తున్నాయి. అన్యాయం జరిగిందని పెద్దల సమక్షంలో మొరపెట్టుకుంటే.. వారు చెప్పిన తీర్పు మానవత్వానికి మకిలిపట్టించినట్టుంది. అత్యాచారం జరిగిందని, న్యాయం చేయమని అడిగితే.. నీ శీలం ఖరీదెంత..? అని అందరిముందు నిలబెట్టి డబ్బులు కట్టించిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..
ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి రక్షణ కరువవడానికి కారణం గ్రామా పంచాయితీలు. ఆ గ్రామాల్లో ఏ తప్పు జరిగినా వారు పోలీసులను ఆశ్రయించారు. పంచాయతీలోని గ్రామ పెద్దలే తీర్పు తీరుస్తారు. వారి మాటే శాసనం. తాజాగా మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన ఓ బాలిక (15) పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా ఆమె నోరునొక్కి ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఈ విషయం బాలిక గ్రామ పంచాయితీలో తెలిపింది. ఈ ఘటనపై గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది.
అత్యాచారానికి గురైన బాలిక శీలానికి పెద్దలు వెల కట్టారు. నీ శీలం ఖరీదు.. రూ. 50 వేలు అని చెప్పి నిందితుడు నుంచి డబ్బులు ఇప్పించారు. అంతేకాకుండా ఏదో పెద్ద శిక్ష విధిస్తున్నట్లు కామాంధుడికి ఐదు చెప్పు దెబ్బలు కొట్టు అంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు జరిగిన అన్యాయం మరొక అమ్మాయికి జరగకూడదని భావించిన బాలిక పెద్దల తీర్పును ఎదిరించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు