మైనర్‌ బాలికపై ఆటో‌డ్రైవర్ అఘాయిత్యం.. ఆరు నెలల గర్భవతి.. ఇప్పుడెలా..?

by Anukaran |
rape
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 12 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్‌ 6 నెలల గర్భవతిని చేసి వదిలేశాడు. ఈ దారుణ ఘటన బోధన్ రోడ్‌లోని ఒకటవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్ మాజిద్ స్థానికంగా ఉంటున్న 12 ఏండ్ల మైనర్‌కు మాయమాటలు చెప్పి, బాలికను బెదిరించి, లొంగదీసుకున్నాడు. అదునుగా పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు మైనర్ బాలికను మందలించగా ఆటో డ్రైవర్ మాజిద్ అత్యాచారం చేసినట్టు చెప్పింది. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story