బీఆర్ఎస్ నేతల బంధువులకు మంత్రి బంపర్ ఆఫర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-17 13:09:48.0  )
బీఆర్ఎస్ నేతల బంధువులకు మంత్రి బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసేందుకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతల బంధువులు వచ్చినా స్వాగతిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అమరికా, దక్షిణ కొరియా దేశాల్లో తమ పర్యటన సాగిందని తెలిపారు. అమెరికా పర్యటనలో 19 కంపెనీలతో రూ. 31,500 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, దక్షిణ కొరియా పర్యటనలో ఆరు కంపెనీలతో రూ. 4,300 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 30,750 మంది యువతకు ఉద్యోగావాకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణ యువతకు ఉపాధి లభించేలా చేసేందుకు భేషజాలు లేకుండా పని చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed