సకల సౌకర్యాలతో ప్రభుత్వాసుపత్రులు: వేముల

by Shyam |
సకల సౌకర్యాలతో ప్రభుత్వాసుపత్రులు: వేముల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కోవిడ్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆసుపత్రుల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పించామన్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లేని మందులు, సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 566 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, 196 బెడ్స్‌కు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. 264 డోసుల రెమీడేసివర్ సిద్ధంగా ఉందన్నారు.

హోం ఐసోలేషన్ అవసరమైన వారు 9666147296 నెంబర్‌కు కాల్ చేస్తే అంబులెన్సు ద్వారా తరలిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, ఆకుల లలిత, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story