రంజాన్ ఇంట్లోనే జరుపుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

by Shyam |
రంజాన్ ఇంట్లోనే జరుపుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రంజాన్ పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో గురువారం ముస్లింలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోందని, ఇప్పటికే జిల్లాలోని దేవాలయాలు, మసీదు, చర్చిలు మూసివేసినట్టు గుర్తుచేశారు. అత్యవసర చికిత్సలు కావలసిన వారు సమాచారం ఇస్తే ఇంటికే వచ్చి చికిత్స చేస్తారని తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న ప్రజలకు ఎం3 ఫ్రెష్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు చెప్పారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణంలో కొత్తగా ఎనిమిది రైతు బజార్లను ఏర్పాటు చేశామన్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మాస్కులు, శానిటైజర్లను అందించారు. కరోనా నివారణకు పోలేపల్లి సెజ్‌లోని హెటేరో ఫార్మా తరఫున జనరల్ మేనేజర్ చంద్రారెడ్డి రూ. 5 లక్షల చెక్కుతోపాటు రూ. 3 లక్షలు విలువ చేసే శానిటైజర్లను మంత్రి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రేమారాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags: Mahabubnagar, Minister v. Srinivas goud, peace meeting, Muslims

Advertisement

Next Story

Most Viewed