12న ఉజ్జయిని మహంకాళి బోనాలు

by  |
12న ఉజ్జయిని మహంకాళి బోనాలు
X

దిశ, సికింద్రాబాద్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12న సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ, పోలీసు శాఖల అధికారులతో పాటు, ఆలయ ట్రస్ట్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఎంతో ఘనంగా, లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా కారణంగా, ఏడాది బోనాల సమర్పణ ఆలయం లోపలే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ అధికారులు, పండితులు, ట్రస్ట్ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇతరులు ఎవరినీ అనుమతించబోరని, పరిస్థితులను అందరూ అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. అదేవిధంగా 13వ తేదీన రంగం కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని, దీనిని ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. జాతర వద్ద పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed