AP Politics: చీరపై CM జగన్‌ కామెంట్.. కూరలో వేసే పసుపుతో పోల్చిన షర్మిల

by Indraja |   ( Updated:2024-04-26 11:41:45.0  )
AP Politics: చీరపై CM జగన్‌ కామెంట్.. కూరలో వేసే పసుపుతో పోల్చిన షర్మిల
X

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న గుంటూరులో ఏపీసీసీ చీఫ్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు ఘాటుగా స్పందించారు. వేలమంది ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా..? ఎవరైనా..? అని ప్రశ్నించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తాను వేసుకున్న బట్టలు మీద ప్రస్తావించారని మండిపడ్డారు.

సొంత చెల్లెలు అని కూడా చూడకుండా, జగన్ ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం ఏం ఉంది ? అని ప్రశ్నించారు. నేను బాబు దగ్గర మోకరిల్లానట, పసుపు చీర కట్టుకున్నానట, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదువు తున్నానట, ఇవన్నీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడిన మాటలు అని దుయ్యబట్టారు.

అవును నేను పసుపు చీర కట్టుకున్నా, అయితే ఏంటి..? పసుపు చీర కట్టుకోవడం తప్పా..? పసుపు కలర్‌పై చంద్రబాబుకి ఏమైనా పేటెంట్ రైటా ఉందా..? చంద్రబాబు పచ్చ కలర్‌ను కొన్నారా..? అని ఆమె ప్రశించారు. జగన్ రెడ్డి మరిచిపోయాడనుకుంటాను, గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది అని ఎద్దేవ చేశారు. పసుపు మంగళకరం అయిన రంగు అని నాడు స్వయంగా YSR చెప్పారని పేర్కొన్నారు.

అలానే పసుపు TDP సొంతం కాదు అని YSR అన్నాడని తెలిపారు. అందుకే YSR స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని, అంతెందుకు పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం కదా అని ఆమె వెల్లడించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు చీర గురించి మాట్లాడుతారా ? నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సీఎంకి సభ్యత ఉందని అనుకోవాలా ? లేక లేదని అనుకోవాలా..? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా..? అని ఘాటుగా దుయ్యబట్టారు.

పైగా తాను చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చందువుతన్నానని తెలిపిన సీఎం గురివింద వేషాలు వేస్తున్నారు అని దుయ్యబడ్డారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చూసుకుంటూ చదివేది జగన్ రెడ్డినే, మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డినే, కనీసం ఆ రాసించిన స్క్రిప్ట్ అయినా సరిగ్గా చదువుతారా అంటే, అదీ చేతకాదు అని ఎద్దేవ చేశారు. ఇక తాను వైఎస్ఆర్ బిడ్డనని, తనకు మోకరిల్లె అవసరం లేదని తెలిపారు.

అలానే మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది తనపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇక బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. ముఖ్యంమత్రిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు, జగన్ రెడ్డి YSR వారసుడు కాదు.. మోడీ వారసుడు, క్రైస్తవులను చంపుతుంటే మోడికి మద్దతు పలికాడని మండిపడ్డారు.

అయ్యా మీకు ఇవ్వాళ బందువులు ఎవరు ? మీకోసం పరితపించే వాళ్ళు, ఇవ్వాళ మీ వెనకా ముందు ఎవరు ఉన్నారో చూస్కోండి అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డితో చెల్లెల్లు ఎవరు లేరు, YSRను తిట్టిన రోజా, రజినీ ఇప్పుడు జగన్‌కి చెల్లెల్లు అని ఎద్దేవ చేశారు. అసెంబ్లీ వేదికగా YSRను తిట్టిన వాళ్ళు ఈయనకు బంధువులని, అలానే CBI YSR పేరును చార్జీ షీట్ లో చేర్చలేదని పేర్కొన్నారు.

ఇవ్వాళ అసలు విషయాలు చెప్తున్నా, YSR పేరును CBI చార్జీ షీట్ లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్ అని, కేసు నుంచి జగన్‌ను బయట పడేసేందుకు YSR పేరును CBI చార్జిషీట్ లో చేర్పించాడని స్పష్టం చేశారు. సుధాకర్ రెడ్డి అనే లాయర్ తో హై కోర్టు లో చేర్పించాడని, పిటీషన్ వేసి మరి చేర్పించాడని, ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడని ఆమె వెల్లడించారు.

ఇది వాస్తవం కాదా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండి, సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదని, మీ గుండెలో ఉన్నది గుండెనా..? బండనా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్నను చంపిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని, హంతకులను రక్షిస్తూ వాళ్ళకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు.

అలానే జగన్ పులివెందులకు వెళ్ళారు. వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు, ఈ నేపథ్యంలో ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదు అని మండిపడ్డారు. వివేకాకు రెండో పెళ్లి అయ్యిందట.. ఇంకో సంతానం ఉందట, ఇన్నీ అబద్దాలు చెప్పి జగన్, వివేకా ప్రజా నాయకుడు అని గానీ ...YSRకి తమ్ముడు అని గానీ ఎందుకు చెప్పలేదు ? అని ప్రశ్నించారు.

ఆయన YSRCP కోసం ఎంత పని చేశారు ? ఇదేమి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వీళ్ళు వివేకా గురించి మాట్లాడొచ్చు అంట.. మేము మాట్లాడొద్దు అంట, తాము మాట్లాడకూడదు అని కోర్టు నుంచి ఆర్థర్ తెచ్చారని, వాళ్ళకి ఓ న్యాయం తమకో న్యాయమా..? అని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట.. మంచోడు అంట.. ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట అని ఎద్దేవ చేశారు.

అవినాష్ రెడ్డిని MPగా నిలబెట్టినప్పుడు తాము ఎదురు చెప్పలేదని, వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే అని పేర్కొన్నారు. వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా..? అని ప్రశ్నించారు. తమకు అవినాష్ రెడ్డి భవిష్యత్ పాడు చేసే అవసరం లేదని తెలిపారు. అలానే అవినాష్ రెడ్డిని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు ? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా ? ఆలోచన శక్తి లేదా..? CBI అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా ? అని ప్రశ్నించారు.

మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. సాక్షి చానెల్‌లో వివేకా హత్యను గుండెపోటుగా చూపించారని, అధికారంలో లేనప్పుడు CBI దర్యాప్తు కావాలని అడిగారని, అధికారంలోకి వచ్చాకా CBI దర్యాప్తు వద్దు అన్నారని, ఎందుకు వివేకా కేసులో వెనకడుగు వేస్తున్నారో చెప్పాలి అని అన్నారు. అలానే సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ నిలబడి చూశాడు అని మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడని తెలిపారు.

Read More..

విశాఖ ఉక్కు విక్రయాలపై హైకోర్టు స్టేటస్ కో

Advertisement

Next Story