ముఖం దాచుకుంటున్న స్టార్ బ్యూటీ..ముసుగు చాటున ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

by Disha Web Desk 8 |
ముఖం దాచుకుంటున్న స్టార్ బ్యూటీ..ముసుగు చాటున ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ అనుపమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ శతమానం భవతి సినిమాతో ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుంచి వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇక తర్వాత కొన్ని రోజుల టాలీవుడ్‌లో ఎక్కువగా సందడి చేయని ఈ చిన్నది రీసెంట్‌గా వరస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో లక్కీ గర్ల్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా టిల్లు స్క్వేర్ మూవీలో రొమాంటిక్‌గా కనిపించి అందరినీ మాయ చేసింది ఈ క్యూట్ బ్యూటీ. మూవీలో తన నటనతో అందరికీ మైకం తప్పించింది.. దీంతో యూత్ డ్రీమ్‌గర్ల్‌గా లీల్లి మారిపోయిందంటే, ఈ నటి ఎంతలా ఆ పాత్రలో ఒదిగిపోయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా తర్వాత అనుపమకు చాలా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ,చాలా కాలం తర్వాత మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫర్ కేరళ మూవీలో నటిస్తుంది. అలాగే తెలుగులో సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు అనుపమ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

అందులో అనుపమ తన ముఖాన్ని దాచుకొని, ముక్కుపుడకతో చాలా స్పెషల్‌గా ఉంది. ముఖంపై చున్నీ కప్పుకొని ఉన్న ఆ ఫోటో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.దీంతో ఈ మూవీలో అనుపమ బంజారా లుక్ లో కనిపించనుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇక తెలుగులో ప్రవీణ్ కండ్రేగుల, అనుపమ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ వీడియోను ఈరోజు సాయంత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed