BREAKING: దేవర మూవీ యూనిట్‌పై తేనెటీగల దాడి.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

by Shiva |   ( Updated:2024-05-06 14:53:28.0  )
BREAKING: దేవర మూవీ యూనిట్‌పై తేనెటీగల దాడి.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్‌రామ్‌ సమర్పణలో యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై పాన్‌ ఇండియా మూవీగా ‘దేవర’ శరవేగంగా తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్ తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఘటన జరిగిన ప్రాంతంలో హీరో ఎన్టీఆర్ ఉన్నారా.. లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఎన్టీఆర్ ఆశేష అభిమానులతో పాటు, ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'దేవర' ఒకటి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమే ఇది. అంతకుముందు వీరిద్దరూ కలిసి తీసిన జనతా గ్యారేజ్ బంపర్ హిట్టు కొట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత మరోసారి వీరు కలిసి పని చేస్తున్నారు. దీంతో దేవర సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జతగా అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుండటం విశేషం.

Read More...

'పుష్ప' కాపీ.. నా సినిమానే ఒరిజినల్.. కన్నడ డైరెక్టర్ పోస్ట్‌తో నెట్టింట దుమారం

Advertisement

Next Story