- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ అభివృద్ధికి ప్రధాని భరోసా.... చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. , కానీ ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో పోతోందని ఎద్దేవా చేశారు. కూటమిది అభివృద్ధి మంత్రమని, వైసీపీది అవినీత మంత్రమని చంద్రబాబు విమర్శించారు. కూటమి ఎందుకు ఏర్పడిందో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూటమికి అన్ని మంచి శకునాలేనని చెప్పారు. వైసీపీకి అన్ని పీడ శకునాలేని సెటైర్లు వేవారు. ఈ ఎన్నికల్లో సైకో జగన్ పోవాలని, ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పవన్ ఏత్యాగానికైనా సిద్ధంగా ఉంటారని, సీట్ల కోసం ఆలోచించరని చెప్పారు. అలాంటి పవన్ కల్యాణ్‌ను విశాఖ వస్తే ఆటంకాలు కలించారని, బలవంతంగా తరలించారని మండిపడ్డారు. విశాఖ నగరం జగన్ సొత్తు కాదన్నారు. ఎన్టీయే గెలుపు ఖాయమని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని సైతం చెప్పారన్నారు. అవినీతి సర్కర్ ఇంటికే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అధికారం చేతిలో ఉందని 59 నెలల పాటు జగన్ విర్రవీగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.