స్త్రీలు మెట్టెలు ధరించడం వలన కలిగే లాభాలు..

by Dishafeatures1 |
స్త్రీలు మెట్టెలు ధరించడం వలన కలిగే లాభాలు..
X

దిశ,ఫీచర్స్: సాదారణంగా ఒక స్త్రీ కి వివాహం అయిందా లేదా అని గుర్తించడానికి మంగళసూత్రం,మెట్టెలు,నుదుటిన బొట్టు లాంటివి ఉంటాయి. అయితే పెళ్లయ్యాక మహిళలు కాలికి మెట్టెలు ధరిస్తారు దాని వల్ల వారి అందం మరింత పెరుగుతుంది.

అసలు స్త్రీలు కాలికి మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి..అనే ప్రశ్న చాలా మంది మనస్సులలో తలెత్తుతుంది. దీని వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయమైన కారణాలు తెలుసుకుందాం.

పెళ్లి అయిన స్త్రీలు మెట్టెలు ధరించడానికి కారణం సనాతన ధర్మంలో వివాహం తర్వాత మహిళలు మెట్టెలు వేసుకోవడం స్త్రీల భౌతిక ప్రయోజనం, సంప్రదాయం. అలాగే ఇవి ధరించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని నమ్ముతారు. అలాగే భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఆకర్షిస్తుంది. దీంతో లక్ష్మీదేవి కటాక్షిస్తుందని మహిళల నమ్మకం. దానితో పాటు ప్రతికూలత తగ్గి ఆనందం, శాంతి పెరుగుతుంది. మెట్టెలు వెండితో మాత్రమే తయారుచేస్తారు. ఎందుకంటే వెండికి కారకుడు చంద్రుడు. వెండి ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

అదే విధంగా మెట్టెలు ధరించడానికి అనేక శాస్త్రీయ ప్రాముఖ్యతలు ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, మహిళల్లో థైరాయిడ్ అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. సహజంగా వెండి చల్లగా ఉంటుంది. కాబట్టి వేడి, ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. దానితో పాటు గుండె, గర్భాశయానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. హార్మోన్ల వ్యవస్థ బాగానే ఉంటుంది. ఇది ఆక్యుప్రెషర్‌గా పనిచేస్తుంది.



Next Story

Most Viewed