- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: గన్‌పార్క్ వద్ద హైటెన్షన్.. రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటనతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు రాక నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. గన్‌పార్క్ వద్దకు ఎవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖతో చేరుకున్నారు. ఆయనతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు కీలక నేతలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తూ రాజీనామా లేఖతో ఆయన అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తూ అమరవీరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖతో హరీష్ రావు చేరుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్దకు రావాలని హరీష్ రావు సవాల్ చేశారు.