మంత్రి తలసాని ప్రత్యేక పూజలు

by Shyam |
మంత్రి తలసాని ప్రత్యేక పూజలు
X

దిశ, సికింద్రాబాద్: బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పీడ తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్, ఆలయ ఈవోలు పాల్గొన్నారు.

Advertisement

Next Story