- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేష్ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలను ఏకాభిప్రాయంతో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఏవిధంగా నిర్వహించాలి అనే విషయంపై సమావేశంలో ఉత్సవ సమితి సభ్యులు అభిప్రాయాలు వ్యక్త పర్చారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని.. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో గణేష్ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై చర్చించడం కోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మరో నాలుగులో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దేవాదాయ శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.