ర‌క్త‌దానం మహాదానం

by Shyam |
ర‌క్త‌దానం మహాదానం
X

దిశ, వరంగల్: ర‌క్త‌దానం మ‌హాదాన‌మ‌ని, ఆప‌ద‌లో ఉన్న వారికి ర‌క్తం ఇవ్వ‌డం వలన వారి ప్రాణాలను కాపాడవచ్చునని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..విపత్కర పరిస్థితులన ప్రస్తుతం స‌మాజంలో ప్ర‌శాంత‌త నెల‌కొంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. అలాంటి వారికి రక్తం దానం చేయడం వలన వారి ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. కావున ర‌క్త‌దాన శిబిరాలు విరివిగా నిర్వ‌హించి, ర‌క్త‌దానం చేసేవారిని ప్రోత్స‌హించాల‌ని మంత్రి కోరారు. జిల్లాలో త్వ‌ర‌లోనే ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మంత్రి వెల్లడించారు. ఈ విషయమై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష జరిపారన్నారు. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైన ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్‌కు త్వ‌ర‌లోనే టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే దేవాదుల ప్రాజెక్టు నీటి విష‌య‌మై కూడా సీఎంతో చర్చించినట్టు మంత్రి వివ‌రించారు.

tags: blood donation camp, panchayati raj minister errabelli, mla rajaiah

Advertisement

Next Story

Most Viewed