- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా నిర్వహించాలి
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాల టీఎస్ ఆర్టీసీ కార్గో బస్సుకు ఆయన మహబూబ్‌నగర్ ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాకు మొత్తం 4,65070 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడత 387850 పుస్తకాలు వచ్చాయని, వీటన్నిటిని జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలకు ఇదివరకే అందించడం జరిగిందని, జిల్లా పరిషత్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే వీటిని పంపించాలని ఆదేశించారు. టీఎస్ ఆర్టీసీ కార్గో సేవల ద్వారా మండలాలకు పాఠ్య పుస్తకాలు పంపిస్తామని, ఈనెల 22 నుంచి 25లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలని ఆయన ఆదేశించారు. 22 నుంచి 25 తేదీల మధ్యలో ఏదో ఒకరోజు పిల్లలను పాఠశాలకు పంపించి పుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, మున్సిపల్ చైర్మెన్ నర్సింలు, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.