- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరును అన్ని విధాల అభివృద్ధి చెందిస్తున్నాం.. మరింత అభివృద్ధి సాధించి, ఇక్కడి ప్రజలు ఐకమత్యంతో శాంతియుత జీవనం గడిపేందుకు అందరం యేసు ప్రభువును ప్రార్థిద్దాం అని రాష్ట్ర ఎక్సైజ్, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎం బి చర్చి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవుల సమక్షంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతికి, విజ్ఞానానికి, సేవకు మార్గం చూపిన దేవుడు ఏసు ప్రభువు ఆయన అనుసరించిన విధానాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి అని చెప్పారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌కు దీటుగా రూపొందించుకున్నమని, మరింత అభివృద్ధి చెందేందుకు యేసు ప్రభువు దీవెనలు అవసరమవుతాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకు మరింత మేలు జరిగే విధంగా క్రైస్తవులు ఈ డిసెంబర్ మాసం అంతా ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేను అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పండగ వేడుకల ప్రారంభానికి సూచికగా క్యారల్స్‌ను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కే సీ నరసింహులు, పలువురు క్రైస్తవ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.