లాఠీ పట్టి.. వాహనదారులకు చుక్కలు చూపించిన మంత్రి

by Shyam |
Minister Srinivas Gowd
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాఠీ చేత పట్టారు. శుక్రవారం రాత్రి పాలమూరు జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన ఆయన.. ముఖ్య కూడలి వద్ద పోలీసులతో కలిసి వాహనాలపై వచ్చి పోయే వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఇంత చెబుతున్నా లాక్ డౌన్ సమయంలో ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని ప్రశ్నించారు. కొంతమంది తమ తమ ఐడెంటి కార్డులను చూపించి తాము వెళుతున్న పనులను గురించి మంత్రికి వివరించారు. మరికొందరు ముఖ్యమైన పనులు లేకున్నా బయటకు రావడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Srinivas Gowd

అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి కొవిద్ పేటెంట్లకు వైద్యం అందుతున్న విధానాన్ని పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ కిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story