ఎక్సైజ్ సిబ్బందిపై తండా వాసుల దాడి 

by Shyam |
ఎక్సైజ్ సిబ్బందిపై తండా వాసుల దాడి 
X

దిశ, మహబూబ్ నగర్: గుడుంబా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ సిబ్బందిపై ఆదివారం తండా ప్రజలు దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో సీఐతో సహా పలువురు సిబ్బంది గాయపడ్డారు. వివరాల్లోకివెళితే..మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి ఉదండాపూర్ శివారులోని ఒంటికుంట తండాలో గుడుంబా తయారు చేస్తున్నట్టు జడ్చర్ల అబ్కారీ సీఐ బాలాజీ నాయక్‌కు సమాచారం వచ్చింది. సిబ్బందితో కలిసి తనిఖీలు చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ సీఐ, సిబ్బందిపై తండా వాసులు దాడి చేశారు. దాడిలో సీఐ, మరి కొంతమంది కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

సిబ్బందికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శ..

పోలీసులపై దాడి విషయం తెలుసుకున్న రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే జడ్చర్ల అబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్సైజ్ సీఐ బాలాజీనాయక్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ్, వెంకటేష్, ట్రైనీ ఎస్ఐ ఉమామహేశ్వర్లను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పట్టణాలకు వలస వెళ్ళి జీవనం సాగిస్తున్న వారు లాక్‌డౌన్ వల్ల తిరిగి గుడుంబా తయారీకి పూనుకున్నట్టు వెల్లడించారు.ఇక మీదట ఎవరైనా గుడుంబా తయారు చేస్తే విడిచిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు. గుడంబా తయారీ పూర్తిగా మానుకోవాలని తండా గ్రామస్తులకు సూచించారు.

Tags: excise police, attack by tanda people, ci and security injured, gudumba made

Advertisement

Next Story

Most Viewed