- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిల్లరగా మాట్లాడితే ప్రజలే పాతాళానికి తొక్కుతారు: శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే తదితర సంస్థలను ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అప్పట్లో ప్రకటించారు. జాతీయ హోదా అటు ఉంచితే.. కేంద్రం నుంచి కనీసం ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు సహకారం చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సమైక్యాంధ్ర ప్రభుత్వ హయాంలో రాయలసీమకు నీళ్లు తీసుకువెళుతుంటే హారతులు పట్టిన బీజేపీ నేతలు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర మేలుకోసం కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్, తదితర నేతలు ముఖ్యమంత్రిని విమర్శించే సమయంలో భాష చిల్లర మల్లరగా ఉంటుందన్నారు. ఈ కామెంట్లతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత మీ మాటలను, మీ వ్యవహారశైలిని చూసి అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఇలాగే చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో ప్రజలే పాతాళానికి తొక్కుతారు అంటూ మంత్రి హెచ్చరించారు.