- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రివర్యా.. పరీక్షలు రాసేదెట్లా..?
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: సార్ మాకు పరీక్షలు ఈ సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎలా పరీక్షలు రాయాలి..? మా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాస్టల్లో ఉండి పరీక్షలు రాసే అవకాశం కల్పించండి అని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలో హాస్టల్లో ఉండి చదువుకునే వారిమని, కరోనా వల్ల హాస్టళ్లు మూతపడ్డాయని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులలో డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర పరీక్షలు ఆరంభంకానున్నాయి. అంత దూరం నుంచి వచ్చి ఎలా పరీక్షలు రాయాలి, పరీక్షలు ముగిసేవరకు మాకు హాస్టల్ వసతి కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థుల సమస్యను జిల్లా కలెక్టర్ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సాధ్యం కాకుంటే తన సొంత ఖర్చులతోనైనా వసతి కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో బాధిత విద్యార్థులు పరీక్షలు రాయడానికి మార్గం సుగమం అయింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎస్ నాయకులు లక్ష్మణ్, నరేష్, ప్రశాంత్, రమేష్, శ్రీకాంత్, గోపి, రాజు, శ్రీను, బాలు, సురేష్, రాహుల్, కిరణ్, గణేష్, సంజు, బద్రి తదితరులు పాల్గొన్నారు.