- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పనులు చేస్తున్నా.. చెప్పుకోలేక పోతున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామాలు.. పట్టణాల్లో పెద్ద మొత్తంలో పనులు చేస్తున్నా.. వాటి గురించి ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ అర్బన్ టూరిజం పార్క్‌లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 2014కు ముందు, ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు ఏ స్థాయిలో అభివృద్ధి జరిగాయో అంచనా వేయవచ్చు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధికి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివర్ణించారు.
అభివృద్ధి పనుల విషయంలో గ్రామ స్థాయి స్థాయిలో సర్పంచ్ మొదలుకొని మంత్రుల వరకు కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ ఆ విషయాన్ని ప్రజలు గుర్తించేలా కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జనాలకు వివరించాలన్నారు. అభివృద్ధి జరగలేదంటే అందుకు ప్రజాప్రతినిధులే బాధ్యులని మంత్రి గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులు సరిగ్గా పని చేయకపోవడం వల్లే అభివృద్ధికి ఆటంకాలు వస్తాయన్నారు. అటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా గుర్తించి సంబంధిత ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.