- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవి కలగానే మిగిలిపోయాయి -మంత్రి శ్రీనివాస్
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : విజయదశమిని పురస్కరించుకుని వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టాలు అందజేశారు. ముందుగా దివ్యాంగులకు పట్టాలు అందజేసిన ఆయన ఆ తర్వాత మహిళా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత 70 ఏళ్ళలో పేదవాడి ప్రాథమిక అవసరాలు అయిన కూడు గూడు గుడ్డ కలగానే మిగిలిపోయాయని, పేదవాడి సొంత ఇంటి స్వప్నాన్ని నిజం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్రంలో వీరన్నపేట్ లో నిర్మించిన ఇళ్లను ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారని లబ్ధిదారులు అందరికీ ఈ రోజు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story