- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయండి
దిశ, మహబూబ్ నగర్ :
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అప్పనపల్లి వద్ద అదనంగా మరో రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం జంక్షన్ల సుందరీకరణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జడ్చర్ల మహబూబ్ నగర్ రహదారి విస్తరణ పనుల్నివేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలోనే జీవో నంబర్ 113, 114 ద్వారా అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించనున్నట్టు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న నీటి పైపులైన్ షిఫ్టింగ్ చేయడంతో పాటుగా బ్రిడ్జి నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కూడా అందజేస్తామన్నారు. అందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. అంతేకాకుండా రూ.10కోట్ల వ్యయంతో భూత్పూరు మహబూబ్ నగర్ రహదారి పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు.
Tags: minister srinivas goud, magaboob nagar, road extension works