- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరితహారాన్ని పకడ్బందీగా చేపట్టాలి : శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మహిళా హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారం కింద మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు.
జిల్లాలో మహిళా హరితహారం సందర్భంగా ఒకేరోజు 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌తో పాటు, ట్యాంకర్, నీటి వసతిని ఏర్పాటు చేసిందని.. దాంతో హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మహిళలతో మొక్కలు నాటించేందుకు మహిళా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మున్సిపాలిటీలలో కూడా చైర్మన్లు, కౌన్సిలర్లు సమిష్టిగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, అదనపు కలెక్టర్ సీతారామరావు, డీఆర్వో స్వర్ణలత, డీఎస్వో వనజాత, మున్సిపల్ చైర్మన్ నరసింహులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.