- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి వారికి జన్మనిచ్చి వృథా… మంత్రి ఆగ్రహం
దిశ ప్రతినిధి, మహబుబ్‌నగర్: కరోనాతో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోవడం హేయమైన చర్య అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన కరోనా అంటుకోదని స్పష్టం చేశారు. గాంధీ తదితర ఆస్పత్రుల్లో కరోనాతో మృతిచెందిన వారిని వారి కుటుంబ సభ్యులే తీసుకువెళ్లడానికి ముందుకు రాకపోవడం, మనుషుల్లో మానవత్వం చనిపోయిందనడానికి నిదర్శనం అన్నారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం.. పీపీఈ కిట్లు వేసుకొని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతోనే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరైనట్టు తెలిపారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారి జన్మ వృథా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అపోహలు వీడి ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు.