- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఆ దిశలో దూసుకెళ్తోంది: మంత్రి సింగిరెడ్డి
దిశ, వనపర్తి: తెలంగాణలో అన్ని రంగాలు పురోగమనం దిశగా దూసుకెళ్తున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషతో కలిసి వనపర్తి మండలం చందాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనంను నియోజకవర్గానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సర్పంచ్ చెన్నారెడ్డిని సన్మానించారు. గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఒక్క వ్యవసాయం రంగంలోనే కాకుండా.. గ్రామాలలో కూడా పరిశుభ్రతలో మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలను సద్వినియోగం చేసుకుని.. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ లాభసాటి వ్యవసాయాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వ్యవసాయాధికారి కుర్మయ్య, గొర్రెల పెంపకదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.