మూడు వేల కోట్లకు 250 కోట్లు వడ్డీ..!

దిశ వెబ్‎డెస్క్: రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‎మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.3 వేల కోట్లకు పైగా కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని విమర్శించారు. ఆ రూ.3 వేల కోట్లకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామని అన్నారు. ఆ డబ్బును రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా.. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు పక్కదారి మళ్లీంచారని విమర్శించారు.

Advertisement