కళ్లున్న కబోదుల్లా ప్రతిపక్షాలు : సత్యవతి రాథోడ్

by Shyam |
కళ్లున్న కబోదుల్లా ప్రతిపక్షాలు : సత్యవతి రాథోడ్
X

దిశ, వరంగల్: ప్రతిపక్షాలకు పనిలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక వర్గంలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాదారణ లేక ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు.. ఏటూ గతిలేక ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయన్నారు. నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి, నేడు ప్రాజెక్టులు సందర్శిస్తామనడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. సీఎం రైతులు బాగుండాలని 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు, రైతుబంధు ఇస్తున్నారని, వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకు నియంత్రిత విధానంలో సాగు చేయాలని చెబుతున్నారని తెలిపారు. కరోనా కష్టం కాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.35వేల కోట్లతో దేశంలో ఎక్కడా చేయని విధంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. రూ.25వేల లోపు ఉన్న రైతు రుణాల మాఫీ కోసం రూ.1200 కోట్లు ఇచ్చారన్నారు. గతంలో రైతుబంధుకు రూ.6000 కోట్లు ఇస్తే ఈసారి రూ.7000 కోట్లు ఇచ్చి ప్రతి రైతుకూ ప్రభుత్వం సాయం అందేలా చూస్తున్నారని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed