ఒక్కరోజే తొమ్మిది లక్షల చేప పిల్లలు వదిలాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Shyam |
Minister Sabita Indrareddy
X

దిశ, జల్‌పల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువులో 32 వేల బంగారుతీత, బొచ్చ, రవ్వ చేప పిల్లలను వదిలారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 72 లక్షల చేప పిల్లలను అతి త్వరలోనే చెరువుల్లో వదలనున్నామని, ఒక్కరోజే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 లక్షల చేపపిల్లలను వదలినట్లు మంత్రి తెలిపారు.

బాలాపూర్ పెద్ద చెరువు నేటికీ అలుగు పారుతున్న నేపథ్యంలో చేప పిల్లలు జారిపోకుండా, వెంటనే అలుగుపై నెట్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటి మేయర్​ఇబ్రాం శేఖర్, రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్​రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్, బంగారి మనోహర్, ముదిరాజ్​సంఘం అధ్యక్షుడు గిరి ముదిరాజ్, కో-ఆఫ్షన్​మెంబర్ ఖలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed