- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ ప్లాస్మా దానం చేయండి : ఈటల
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్టుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ క్రమంలోనే కోవిడ్ బారిన పడి కోలుకున్న బాధితులకు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక అభ్యర్థన చేశారు. కరోనా నుంచి రికవరీ అయిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం వల్ల కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చని ఈటల తన అధికారిక ట్విట్టర్ ద్వారా సూచించారు.
Requesting #COVID19 recovered patients to please come and donate #Plasma and save covid patients.
— Eatala Rajender (@Eatala_Rajender) July 9, 2020
కరోనా వైరస్ బారినపడి, పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం ద్వారా వారు కోలుకుంటున్నారు. దీంతో కోవిడ్ స్పెషల్ ఆస్పత్రి గాంధీ ఆస్పత్రిలోనూ అవసరమైన కరోనా బాధితులకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకోసం కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారిన వారి నుంచి ప్లాస్మా సేకరించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూపులు కూడా సరిపోవాల్సి ఉంటుంది. రికవరీ రేటు బాగుండటంతో… గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.