ఆ రాష్ట్రాల్లో కూడా.. ఇలాంటి కార్యక్రమం లేదు

by Sridhar Babu |
ఆ రాష్ట్రాల్లో కూడా.. ఇలాంటి కార్యక్రమం లేదు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోటపడు గ్రామంలోని మచినేని చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన 68వేల చేప పిల్లలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు.

అలాంటి రాష్ట్రాలతో మత్స్య‌సంపదలో పోటీపడి నీలివిప్లవం వైపు పయనిస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ మత్యకారుల మోముల్లో సంతోషం నింపారని, సబ్బండ వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచారన్నారు. ఖమ్మం జిల్లాలో సహజ నీటి వనరులపై ఆధారపడి నేటివరకూ జిల్లాలో 186 సహకార సంఘాల నమోదు అయ్యాయన్నారు. ప్రాథమిక సంఘాలు 143, మహిళ సంఘాలు 30, హరిజన సంఘాలు 6, గిరిజన సంఘాలలో 14031 మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించామన్నారు.

2020-21 సంవత్సరానికి గాను ప్రభుత్వం 100శాతం రాయితీపై ఖమ్మం జిల్లాలో 963 చెరువులలో 3.45 కోట్ల చేప పిల్లలను వదలనున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో 963 చెరువులకు గాను 3,45,47,710( మూడు కోట్ల నలభై ఏడు లక్షల ఏడు వందల పది) చేప పిల్లలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 691 చెరువులకు గాను 1,78,68,300(కోటి 78 లక్షల 68 వేల మూడు వందలు) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1694 చెరువులకు(చిన్న, పెద్దా చెరువులు కలిపి) గాను 5.24 కోట్లు(5,24,16,010) చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed