పస్తులుండొద్దనే ఉచిత బియ్యం : పువ్వాడ

by Sridhar Babu |
పస్తులుండొద్దనే ఉచిత బియ్యం : పువ్వాడ
X

దిశ‌, ఖమ్మం: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌ‌న్ విధించింది. దీని మూలంగా పేదలు పస్తులు ఉండొద్దని, ఆపదలో వారిని ఆదుకోవాల‌నే సంక‌ల్పంతోనే సీఎం కేసీఆర్ పేద‌ల‌కు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నార‌ని, రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబంలోని ఒక్కొక్కరికి 12కేజీలు, ఇంటికి రూ.1500 ఇస్తున్నార‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని రేష‌న్ దుకాణంలో నిరుపేద‌ల‌కు మంత్రి ప్ర‌భుత్వం అంద‌చేస్తున్న ఉచిత 12కిలోల బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్ద‌ కొడుకులా ఆలోచిస్తున్నార‌న్నారు. ప్ర‌పంచం స‌హా, దేశంలో ఆర్థిక మాంద్యం తాండ‌విస్తున్న వేళ కూడా సంక్షేమాన్ని ఆప‌లేద‌న్నారు. అలాగే, క‌రోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి పెద్ద న‌ష్టం వాటిల్లుతున్న‌ద‌ని, అయినా, వెర‌వ‌కుండా, ప్ర‌జ‌ల సంక్షేమమే ల‌క్ష్యంగా ఉచిత బియ్యం, ఆర్థికసాయం అందించాల‌ని ముందుకు వ‌చ్చార‌న్నారు. గ‌తంలో ఎక్క‌డా లేని విధంగా మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్, పేద‌లకు అండగా, కుటుంబ పెద్ద‌గా ఆలోచిస్తున్నార‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌లు చేయాల్సిందిల్లా లాక్‌డౌన్‌ని పాటించాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇళ్ళ నుంచి బ‌ట‌య‌కు వెళ్ళ‌కుండా, ప‌రిశుభ్రంగా ఉండాల‌ని సూచించారు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న తెలంగాణ‌ రాష్ట్రం, క‌రోనా క‌ట్ట‌డిలోనూ ముందే ఉంద‌న్నారు. అయితే, ఈ మ‌ధ్య కొంద‌రు ఢిల్లీకి వెళ్ళి, అక్క‌డికి వ‌చ్చిన విదేశీయుల‌తో క‌లిసి మీటింగుల్లో పాల్గొన్నారని, అలాంటి వారితో క‌రోనా ప్ర‌భలే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Tags: minister puvvada ajay kumar, distributed, ration rice, khammam, mla sandra

Advertisement

Next Story