- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నెంబర్ వన్ : మంత్రి పువ్వాడ
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి బేతంపూడి నుండి నరసాయి గూడెం వరకు కోటి ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణం, టేకులపల్లి నుండి గుండాల రోడ్డు మీదుగా డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోటి నాలుగు లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం కామేపల్లి మండలంలోని పండితాపురం గ్రామంలో నాబార్డు స్పెషల్ రీ ఫైనాన్స్ నిధుల నుండి 31 లక్షల వ్యయంతో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. కరోనా సంక్షోభంలో కూడా అభివృద్ధి పనులకు వెనుకడుగు వేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడించారు. త్వరలో ఇల్లందులో టీఎస్ ఐపాస్ ద్వారా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ కూరాకుల నాగభూషణం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.