- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుచరుడి మృతదేహం వద్ద మంత్రి కన్నీరు
దిశ ఏపీ బ్యూరో: మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్‌రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం హత్యకు గురైన భాస్కర్‌రావు కుటుంబాన్ని ఓదార్చారు.
తన అనుచరుడు మోకా భాస్కర్‌రావుది రాజకీయ హత్యేనని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సోమవారం ఉదయం భాస్కర్‌రావును ఓ యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కిరాయి మనుషులతో భాస్కర్‌రావును చంపిచారని పేర్ని నాని అన్నారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారనే కోణంలో ఆరా తీసున్నామని రవీంద్రబాబు వెల్లడించారు.