- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చెయ్ : పెద్దిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీకాళహస్తిలో జరిగిన నవరత్నాల విజయోత్సవ సభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ముంటే ఈసారి పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన ఎక్కడా పోటీ చేసినా గెలవలేరని, అంతేగాకుండా కుప్పంలోనూ ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అంటే గిట్టని వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వారే కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వాహనాలపై దాడులు చేశారని తెలిపారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు జాతీయ నాయకుడు చేశారని ఎద్దేవా చేశారు.