స్వగ్రామంలో సందడి చేసిన రాష్ట్ర మంత్రి

by srinivas |
pioneer
X

దిశ, ఏపీ బ్యూరో: ఒకవైపు పాలనలో..మరోవైపు రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామంలో సందడి చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మర్రిపాడు మండలానికి చెందిన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో మంగళవారం ఉదయం గంగమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి చిన్ననాటి స్నేహితులు..పెద్దలను కలుసుకున్నారు. గంగమ్మ ఆలయంతో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే దర్శనం అనంతరం దేవాలయం ప్రాంగణంలో కూర్చుని అందరితో సంతోషంగా గడిపారు. ప్రసాదం స్వయంగా పంపిణీ చేశారు. స్వగ్రామంలోని విషయాలను..విశేషాలను తెలుసుకుంటూ వారందరీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి శక్తి స్వరూపిణి అని, తనకు గంగమ్మ గుడితో ఎంతో అనుబంధం ఉందన్నారు. స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని తప్పక దర్శించుకోవడం అలవాటు అని చెప్పుకొచ్చారు. కోరికలు తీర్చే కల్పవల్లి అయిన గంగమ్మ తల్లి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed