- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితాల్లో వెలుగులు నింపేందుకే ‘దళిత బంధు’
దిశ, మిర్యాలగూడ: టీఆర్ఎస్ పార్టీతోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతు వేదిక ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా రామచంద్రగూడెం వై జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘దళిత బంధు’ అమలు చేస్తున్నందుకు దళితసంఘాల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, కౌన్సిలర్లు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.