నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

by Shyam |   ( Updated:2020-04-12 07:21:09.0  )
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
X

దిశ, నల్గొండ: కరోనా ఎఫెక్ట్ బత్తాయి రైతులపై పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, జ‌గ‌దీష్‌రెడ్డిలు తెలిపారు. ఆదివారం నల్గొండ క‌లెక్ట‌రేట్‌లో బత్తాయి కొనుగోళ్లపై అధికారులు, రైతులు, ట్రేడర్లతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా బత్తాయి పంటలు సాగు చేసే నల్గొండ జిల్లాలో రైతులు తమ దిగుబడులను ఢిల్లీ, కలకత్తా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేలా అన్ని అనుమతులు ఇచ్చామన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని మంత్రులు హామీ ఇచ్చారు. బీమా కంపెనీల ప్ర‌తినిధుల‌కు వ‌డ‌గళ్ల న‌ష్టం అంచనా వేసి త‌గిన ప‌రిహారం స‌కాలంలో రైతుల‌కు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్టు చెప్పారు.

tag: minister niranjan reddy, jagadish reddy, comments, farmers, nalgonda

Advertisement

Next Story

Most Viewed